top of page

అమ్మ

  • Writer: Lakshmi Jagannadh
    Lakshmi Jagannadh
  • May 13, 2018
  • 2 min read


పుట్టిన ప్రతీ శిశువు ఈ నేలపై పడిన క్షణం, తన శరీరం తన తల్లియొక్క శరీరంలో నుండి బయటకు వచ్చిన క్షణం నుండి జీవన పోరాటం సాగిస్తుంది. అది మొదలు తన ఆలనా పాలన అంతా తనను కన్న మాతృమూర్తి సంరక్షణలో జరుగుతుంది. తాను "ఆకలి" అని ఏడిస్తే, తాను తినటం మాని ఆ పసి పాపకు పెడుతుంది. తనకు ఏదైనా చిన్న కలత వంటికి వచ్చినా, అది తనకే అన్నట్లు బాధ పడుతుంది. అడుగులు వేయడం మొదలు పెట్టగానే వేసిన ప్రతి అడుగులో ఉన్న ఎదుగుదలను చూసి పట్టరాని ఆనందం చెందుతుంది.


ఆమె మనసులో ఎల్లప్పుడూ బిడ్డల గురించి ఆరాటం చెందుతుంది. నోరారా అమ్మ అనగానే తనకు ఎంతో కొండంత శక్తి వచ్చినట్లు తపిస్తోంది. బిడ్డల శ్రేయస్సును కోరే మరో దైవమే అమ్మ.


ప్రతి మనిషీ తనకు ఊహ వచ్చే సరికి తన తల్లిని చూస్తూ ఉంటాడు. ఆ తల్లి ఎంత అనాకారి అయినా ఆమె మాట పాటలలో ఒక ఉత్తేజాన్ని పొందుతాడు. ఆమెలోని అందమైన అమ్మతనానికి ఎంతో పరవసిస్తుంటాడు. అందుకే ఆ భగవంతుడు కూడా తన అవతారాలలో ఆ తల్లి కడుపున పుట్టి, ఆ మాతృమూర్తి యొక్క ప్రేమలో తరిస్తూ ఉన్నాడు.


చాలా మంది కవులు అన్నట్లు భగవంతుడు తన సృష్టిలో ఉన్న అందాలన్నిoటిలోనూ అమ్మతనాన్ని సృష్టించాడు. ఒక వృక్షం తన ఫలాలను పలువురికి పంచుతుంది. అలాగే ఒక నది లోని నీరు దాహార్తిని తీరుస్తుంది. అమ్మతనం అంటే ఒక దయ, ఒక దైవత్వం, ఒక అద్వైతం ఇమిడి ఉన్నాయ్. పశు పక్ష్యాదులలో, జంతువులలోనున్న అమ్మతనం అన్నది చూసిన కొలది చూడాలి అనిపిస్తుంది. ఒక మదర్ థెరిసాలోని అమ్మతనం దయా గుణం సహనం ఎందరో అనాధలకు చేయూతనిచ్చింది. ఆ అమ్మలోని అమ్మతనం అన్నది తన బిడ్డల గురించి కాకుండా, వేదనతో బాధ పడే ప్రతీ ఒక్కరిని ఓదార్చాలనే ఆరాట పడుతుంది. ఆమె జీవితం లో ఒక నిస్స్వార్థ మైన సేవ ఉంటుంది. ఇంటిలోని వారి గురించే కాకుండా వీలు అయితే తన జీవితంలో చేతనైనంత సహాయం చేసి జీవితాన్ని త్యాగం చేయటం ఆమె గొప్పతనం. బిడ్డలు ఎదిగిన తరువాత వారు వేసే తప్పటడుగులు సరిదిద్దాలని తనకు చేతనైనట్లు కృషి చేస్తుంది. తన జీవితంలోని ఆటుపోట్లు ఎదుర్కొన్న బిడ్డలకు ఎప్పుడూ మంచి జరగాలని చని పోయేవరకు దీవించే, కనిపించే దైవమే అమ్మ. తనలోని కలలను నిజం చేసుకొని కళ్ల ముందు తిరిగే బిడ్డలలో అవి చూసుకొనే నిష్కల్మష గంగా వాహిని. గంగా నదిలో స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకున్నట్లు ఒక తల్లి బిడ్డలు చేసిన తప్పులు క్షమిస్తుంది.


ఈ రోజుల్లో చాలా మంది అమ్మలోని త్యాగాలను గుర్తించుట లేదు. వారు జీవితంలో అమ్మను చివరి రోజుల్లో ఇబ్బంది పెట్టకుండా, తనకు మనశాంతిని కలుగజెయ్యాలి . జీవితంలో అమ్మయొక్క ఋణం మనం తీర్చలేనిది. ఆ ఋణం తీర్చుకోటానికి అయినా ప్రతి ఆడదానిలోని అమ్మతనానికి మనం సెల్యూట్ చెయ్యాలి.


నా జీవితంలో నా తల్లి వలన నేను ఎంతో స్ఫూర్తిని పొందాను. నా దివంగత మాతృ మూర్తియొక్క దివ్య మధుర స్మృతులను తలుచుకుంటూ అందరికి మదర్'స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ..

ఇట్లు,

లక్ష్మి జగన్నాధ్

Comments


Like my writings?

Never miss a post

Follow me

© 2023 by Raji Malla.
SAVE OUR TREES
 

Call

T: +91 911-052-0498

Contact

rjrjswrdvi@gmail.com
rjrjswrdvi@outlook.com

  • LinkedIn Social Icon
  • Facebook Clean
  • Twitter Clean
  • White Google+ Icon
bottom of page