ఓ యువతా! నీభవిత ఎటు?
- Lakshmi Jagannadh

- May 20, 2018
- 1 min read
ఓ యువతా! నీభవిత ఎటు?.........ఓ యువతా! నీభవిత ఎటు?
మనకు ఆది ఋషులు చూపించిన సష్ణ్ణుప్తజ్జాన సమాధిలోనికా?
మనకు నవ బాబాలు చూపించిన ఆజ్జ్ఞాన సమాధిలోనికా?
ఒకవైపు భారతావనిలో జ్జ్ఞానమంతా మీ రూపంలో తరలిపోతుంటే,
మరోవైపు విదేశీ సంస్కృతి అజ్జ్ఞానంతో మరలి వస్తుంటే
మీ ఆకాంక్షలను పక్కనపెట్టి, మరొకరి కాంక్షలకు బలవుతుంటే,
చిన్న చిన్న సమస్యలకు పెద్దపెద్ద అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంటే,
"ప్రేమే జీవితానికి పరమార్ధము" అని పెద్దలు చెప్పిన దానిలో అర్ధాన్ని
మీకు నిరర్ధకరమైన పరిష్కారాలను తీసుకొని జీవితాన్ని బలితీసుకుంటుంటే
జుకర్బర్గ్గ్, బిల్ గేట్స్ కనిపెట్టిన వాటిని ఒక నూతన ఒరవడితో వడివడిగా అడుగులేస్తూ
కొత్త విశ్వనూతన సమాజంలోకి అడుగిడ కుండా
వికారమైన అద్దాల్లో చూస్తూ మనోనేత్రాన్ని వికారంగా చేస్తూ
ఇప్పటితరం, రేపటి తరాన్ని శారీరకంగా మానసికంగా ముక్కలు చేస్తుంటే,
మీకు ఏమి మనసు చలించలేదా!
ప్రతి సవంత్సరం వత్సరం అంతా కష్టపడి చదివిన విద్యార్థికి,
స్లిప్పులతో రాసిన విద్యార్థికి తేడాలేకుంటే
ఆవిద్యార్దికి ఎప్పటికి ఆసమస్య తేలకుండా మిగిలిపోతుంటే,
దానికి నీవు పరిస్కారం ఆలోచించావా!
రాజకీయ కుట్రలతో సమ్మెలు, సినీ రాజకీయకుట్రలతో, వాదోపవాదాలుతో, మమేకమవుతుంటే?
అసలు సమస్యలను పక్కనపెట్టి కప్పదాట్లువేస్తున్న ప్రభుత్వాలను చూస్తూ ఉంటే
మా కంట ఆగకుండా కన్నీళ్లు రాలు
ఓ యువతా! నీభవిత ఎటు?....
ఓ యువతా! నీభవిత ఎటు?......
ఓ యువతా! నీభవిత ఎటు?........
ఇట్లు,
మీ లక్ష్మిజగన్నాధ్

Photo by Aziz Acharki on Unsplash



Comments